- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
20 రోజులకే ఓటీటీలోకి రాబోతున్న ‘మిత్ర మండలి’ సినిమా.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు
కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘మిత్రమండలి’(Mithra Mandali) బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

దిశ, సినిమా: కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘మిత్రమండలి’(Mithra Mandali) బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీపావళి కానుకగా అక్టోబర్ 16న విడుదలై.. హిట్ అందుకోలేకపోయింది. నటుడు ప్రియదర్శి(Priyadarshi), నిహారిక ఎన్‌ఎమ్(niharika nm) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు విజయేందర్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, వెన్నెల కోషోర్, సత్య, విష్ణు, రాగ్ మయూర్ కీలక పాత్రలో నటించగా.. సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా కేవలం 20 రోజులకే ఓటీటీలోకి రాబోతుండటం విశేషం.
తాజాగా, ‘మిత్రమండలి’ డిజిటల్ స్ట్రీమింగ్‌పై నటుడు ప్రియదర్శి అధికారిక ప్రకటన విడుదల చేశాడు. ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. నవంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘‘మేము నవ్వుకున్నాము.. చాలా నేర్చుకున్నాము.. రీకట్ చేశాం. ‘మిత్రమండలి’ కొత్త వెర్షన్‌ను చూడబోతున్నారు. ఈ సారి మరింత సరదాగా ఉండబోతుంది. డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనుంది. మరోసారి మీ హృదయాలను దోచేయడానికి సిద్ధంగా ఉంది’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ పోస్ట్ చూసిన సినీ ప్రియులు ఆనందపడుతున్నారు.






