- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతున్న మాస్ మహారాజా సినిమా.. అధికారిక ప్రకటన విడుదల
గత కొన్నేళ్లుగా డిజాస్టర్స్ అందుకుంటున్న రవితేజ(Ravi Teja) ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలన్న కసితో పక్కా ప్లానింగ్‌తో వచ్చారు.

దిశ, సినిమా: గత కొన్నేళ్లుగా డిజాస్టర్స్ అందుకుంటున్న రవితేజ(Ravi Teja) ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలన్న కసితో పక్కా ప్లానింగ్‌తో వచ్చారు. మాస్ మహారాజా హీరోగా నటించిన 75వ చిత్రంగా ‘మాస్ జాతర’ (mass jathara)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భాను భోగవరపు (Bhanu Bhogavarapu)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఈ మూవీ అనేక వాయిదాల తర్వాత అక్టోబర్ 31న థియేటర్స్‌లో విడుదలై పెద్దగా మెప్పించలేకపోయింది. భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ రోటీన్ స్టోరీతో వచ్చి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా అంతగా రాబట్టలేకపోయింది.
ఇక రవితేజ కెరీర్ మరో ‘మాస్ జాతర’ డిజాస్టర్ సినిమాల లిస్ట్‌లోకి చేరింది. అయితే ఈ చిత్రం ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నట్లు పలు వార్తలు వస్తున్నాయి. కానీ ఏ యాప్‌లో కనిపించకపోవడంతో సినీ ప్రియులు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ‘మాస్ జాతర’ డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయినట్లు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా..‘‘మాస్ మహారాజా మీ ఇంట్లో జాతర సృష్టించడానికి వచ్చేస్తున్నారు. నవంబర్ 28 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది’’ అని రాసుకొచ్చారు.. థియేటర్స్‌లో విడుదలై నెలరోజులు కూడా కాకముందే ఓటీటీలోకి రాబోతుంది.






