ఓటీటీలోకి రాబోతున్న ‘మదరాసి’ మూవీ.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన హీరో

by Mallepaka Hamsa |

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తీకేయన్(Shiva Kartikeyan), రుక్మిణి వసంత్(Rukmini Vasanth) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మదరాసి’(Madharaasi).

ఓటీటీలోకి రాబోతున్న ‘మదరాసి’ మూవీ.. అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌తో సర్‌ప్రైజ్ ఇచ్చిన హీరో
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తీకేయన్(Shiva Kartikeyan), రుక్మిణి వసంత్(Rukmini Vasanth) కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘మదరాసి’(Madharaasi). ఈ చిత్రాన్ని ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీలో విద్యుత్, బీజు మీనన్ కీలక పాత్రలో కనిపించారు. శ్రీలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ ప్రసాద్ నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్‌లోకి వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ‘మదరాసి’ చిత్రం నెలరోజులకే డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ విషయాన్ని ప్రముఖ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

‘మదరాసి’ సినిమాకు సంబంధించిన ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకోగా.. అక్టోబర్ 1 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రాబోతుంది. ఈ విషయాన్ని తెలుపుతూ.. ‘‘ఒక పిచ్చి ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. ‘మదరాసి’మీ ముందుకు రాబోతుంది. థియేటర్స్‌లో మిస్ అయిన వారు మా చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి’’ అనే క్యాప్షన్ జత చేశారు. అలాగే హీరో శివకార్తికేయన్‌తో అనౌన్స్ చేయించిన వీడియోను షేర్ చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతూ.. సూపర్ ఎగ్జైటెడ్ అని కామెంట్లు పెడుతున్నారు.

link

Next Story