- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్ని కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘కుబేర’ మూవీ.. ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారంటే..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల తెలుగులో కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల తెలుగులో కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ధనుష్(Dhanush), నాగార్జున(Nagarjuna), రష్మిక మందన్న(Rashmika Mandanna) ముఖ్య పాత్రల్లో శేఖర్ కమ్ముల(Sekhar Kammula) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కుబేర’(Kubera). శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్(sunil Narang), పుష్కర్ రామ్ మోహన్ రావు నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్(Posters), గ్లింప్స్(Glimps), ఫస్ట్ సింగిల్(First single) రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో ఈ మూవీ కోసం ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది
ధనుష్ అండ్ శేఖర్ కమ్ముల లైఫ్‌లోనే భారీ బిగ్గెస్ట్ మూవీగా రూ.130 కోట్ల బడ్జెట్‌తో కుబేర తెరకెక్కుతున్నదట. అయితే ధనుష్ ఈ చిత్రంలో యాక్ట్ చేయడానికి రూ.30 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా నాగార్జున రూ.14 కోట్లు, దేవీశ్రీ ప్రసాద్ రూ.3 కోట్లు,రష్మిక మందన్న రూ.4 కోట్ల పారితోషికం తీసుకుంటుందట. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






