క్రిస్మస్ బరిలో భారీ ప్రాజెక్ట్స్‌తో పోటీపడనున్న ‘దండోరా’ సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్

by Mallepaka Hamsa |

శివాజీ, రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna), రవికృష్ణ, నవదీప్, మనీక చిక్కాల, అనూష ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దండోరా’(Dhandoraa ).

క్రిస్మస్ బరిలో భారీ ప్రాజెక్ట్స్‌తో పోటీపడనున్న ‘దండోరా’ సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: శివాజీ, రాహుల్ రామకృష్ణ(Rahul Ramakrishna), రవికృష్ణ, నవదీప్, మనీక చిక్కాల, అనూష ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘దండోరా’(Dhandoraa ). ఇందులో బిందు మాధవి(Bindu Madhavi) వేశ్య పాత్రలో కనిపించనుంది. తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో పురాత‌న ఆచారాలు, సాంప్రదాయాల‌ను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చ‌క్కటి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అగ్రవర్ణాలకు చెందిన అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండ జరుగుతున్నాయనే అంశాలను ఇందులో చూపించబోతున్నారు.

మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. కలర్ ఫొటో, బెదురులంక 2012 చిత్రాలను నిర్మించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేతి రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. మార్క్ కె. రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ విషయంపై మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేశారు. క్రిస్మస్ కానుకగా.. డిసెంబర్ 25న ‘దండోరా’ థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలిపారు. అయితే ఇప్పటికే డిసెంబర్ 25న భారీ ప్రాజెక్ట్స్ అఖండ-2, వృషభ, డెకాయిట్, ఫంకీ, చాంపియన్, శంబాల, చిత్రాలతో పోటీ పడుతుండటం గమనార్హం.

link

Next Story