- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ.. రన్‌టైమ్ ఎంతంటే?
సంక్రాంతి పండుగ సందడిని రెట్టింపు చేసేందుకు ఎప్పటిలానే ఈ ఏడాది కూడా స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద గట్టి పోటీకి సిద్ధమవుతున్నాయి.

దిశ, సినిమా: సంక్రాంతి పండుగ సందడిని రెట్టింపు చేసేందుకు ఎప్పటిలానే ఈ ఏడాది కూడా స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీసు వద్ద గట్టి పోటీకి సిద్ధమవుతున్నాయి. కుటుంబ ప్రేక్షకులను ప్రధానంగా టార్గెట్ చేసుకుని వచ్చే ఈ పండుగ సీజన్‌లో.. వినోదం, కామెడీ, ఎమోషన్ కలబోసిన సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాంటి చిత్రాల్లో మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ (Bhartha Mahasayulaku Wignyapthi)ఒకటి. కిషోర్ తిరుమల (Kishore Tirumala)తెరకెక్కించిన ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భార్యభర్తల మధ్య జరిగే సరదా సంఘటనలు, రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను హాస్యాత్మకంగా చూపిస్తూ.. ప్రేక్షకులను నవ్వులతో పాటు ఎమోషన్స్‌తోనూ టచ్ చేసేలా ఈ కథను రూపొందించారు.
ఈ చిత్రంలో డింపుల్ హయాతీ, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఇద్దరూ గ్లామర్‌తో పాటు నటన పరంగానూ కీలక పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా.. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్, సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచి సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం జనవరి 13న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా, ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంతేకాదు.. కేవలం 2 గంటల 10 నిమిషాల నిడివితో రాబోతున్నట్లు తెలుస్తోంది.






