- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి రాబోతున్న ‘బాహుబలి ది ఎపిక్’ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు..
ర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(S.S. Rajamouli) తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(S.S. Rajamouli) తెరకెక్కించిన ‘బాహుబలి’ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన విషయం తెలిసిందే. ఫాంటసీ, ఎమోషన్, యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్‌ను అద్భుతంగా చూపించిన ఈ చిత్రం ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్ సినిమాలు విడుదలై అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాయి. తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన సినిమాలుగా ఇవి చరిత్రలో నిలిచిపోయాయి. ప్రభాస్ (Prabhas)ద్విపాత్రాభినయం, రానా దగ్గుబాటి భీకరమైన విలన్ పాత్ర, రమ్యకృష్ణ శివగామిగా చేసిన పవర్‌ఫుల్ నటన, అనుష్క శెట్టి దేవసేనగా చూపిన గౌరవం, తమన్నా అవంతికగా నటించి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. విడుదలైన ప్రతి భాషలోనూ బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల కలెక్షన్లతో ఈ చిత్రం రికార్డులు సృష్టించింది.
ఇక ఇటీవల ఈ రెండు భాగాలను కలిపి ‘బాహుబలి ది ఎపిక్’ (Baahubali The Epic) పేరుతో ఒకే సినిమాగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడం విశేషం. మొదటిసారి చూసిన వారికి కొత్త అనుభూతి, ఇప్పటికే చూసిన ప్రేక్షకులకు మళ్లీ అదే మ్యాజిక్‌ను రీ-లైవ్ చేసే అవకాశం లభించింది. దీంతో థియేటర్ల వద్ద మరోసారి అభిమానులు క్యూ కట్టారు. తాజాగా, ‘బాహుబలి ది ఎపిక్’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. డిసెంబర్ 25 నుంచి క్రిస్మస్ కానుకగా స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సుమారు 3 గంటల 40 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, ఒకే సిట్టింగ్‌లో పూర్తి కథను ఆస్వాదించే అవకాశం ఇవ్వనుంది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఆనందపడుతున్నారు.






