ఆ క్షణం రానేవచ్చింది. డెవిల్ గర్జించడానికి సిద్ధంగా ఉన్నాడంటూ బిగ్ అప్డేట్ ఇచ్చిన రచనా రాయ్

by Mallepaka Hamsa |

కన్నడ నటుడు దర్శన్(Darshan) నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ది డెవిల్’(The Devil).

ఆ క్షణం రానేవచ్చింది. డెవిల్ గర్జించడానికి సిద్ధంగా ఉన్నాడంటూ బిగ్ అప్డేట్ ఇచ్చిన రచనా రాయ్
X

దిశ, సినిమా: కన్నడ నటుడు దర్శన్(Darshan) నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ది డెవిల్’(The Devil). ఇందులో రచనా రాయ్(𝐑𝐚𝐜𝐡𝐚𝐧𝐚 𝐑𝐚𝐢) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రకాష్ వీర్ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీజైమాత కంబైన్స్, వైష్ణో స్టూడియోస్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో మహేష్ మంజ్రేకర్, అచ్యుత్ కుమార్, షర్మిలా మాండ్రే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని డిసెంబర్ 11 విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉంది. దీంతో అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం వరుస అప్డేట్స్‌ను రిలీజ్ చేస్తోంది. ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ చిత్రాన్ని మరింతగా ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా, రచనా రాయ్ ‘ది డెవిల్’ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ రాబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ‘‘ఆ క్షణం రానే వచ్చింది. ది డెవిల్ అరా హీట్ పెంచేందుకు రెడీగా ఉన్నాడు.

డిసెంబర్ 5న 10:05గంటలకు ట్రైలర్‌తో గర్జించడానికి సిద్ధమవుతున్నాడు. మీరు చూపించిన ప్రేమ, హైప్, క్రేజ్‌కి ధన్యవాదాలు’’ అని రాసుకొచ్చింది.అందులో కనిపించిన మూడు ఉంగరాలు ధరించిన చెయ్యి ఏ పాత్రదో, ఆ సీక్వెన్స్ సినిమాలో ఏ సందర్భంలో వస్తుందో అనే విషయంలో అభిమానుల్లో చర్చలు మొదలయ్యాయి. దర్శన్ విలన్ షేడ్‌తో కనిపించబోతున్నాడా? లేక ఇది మరో కీలక క్యారెక్టర్‌కు సంబంధించిన సూచనా? అనేది అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది.ఇక మొత్తానికి, యాక్షన్, మిస్టరీ, భావోద్వేగాలు, భారీ ప్రొడక్షన్ విల్యూస్‌తో తెరకెక్కుతున్న ‘ది డెవిల్’ ట్రైలర్‌తో సినిమా మీద హైప్ మరింత పెరగడం ఖాయమని అంతా భావిస్తున్నారు.

link

Next Story