యూట్యూబ్‌లో దూసుకుపోతోన్న మెలోడీ సాంగ్ ‘తేనెల వానలా’..నిఖిల్,ప్రాచీ కెమిస్ట్రీ అదుర్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-23 15:53:26  IST  )

యూట్యూబ్‌లో ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్ హవా నడుస్తోంది. కొన్ని పాటలు అత్యధిక వ్యూస్ రాబడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

యూట్యూబ్‌లో దూసుకుపోతోన్న మెలోడీ సాంగ్  ‘తేనెల వానలా’..నిఖిల్,ప్రాచీ కెమిస్ట్రీ అదుర్స్
X

దిశ, సినిమా: యూట్యూబ్‌లో ప్రస్తుతం ప్రైవేట్ సాంగ్స్ హవా నడుస్తోంది. కొన్ని పాటలు అత్యధిక వ్యూస్ రాబడుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో.. ఓ మెలోడీ సాంగ్ అందరి దృష్టిని ఆకర్షించారు. ‘తేనెల వానలా’ అంటూ సాగే తెలుగు రొమాంటిక్ మెలోడీ గీతాన్ని నవంబర్ 20న విడుదల చేశారు. కార్వార్, గోవాలోని అద్భుతమైన ప్రకృతి అందాల నడుమ, జలపాతాలు, పచ్చని తీరప్రాంతాల్లోని విజువల్స్‌ను చూపిస్తూ కట్టి పడేశారు. ఈ పాటలో ప్రాచీ తెహ్లాన్ (Prachi Tehlan)ఎంతో అందంగా కనిపించారు. మామూలుగానే ఆమెను క్వీన్ ఆఫ్ ది కోర్ట్ అని పిలుస్తారు. ఆమె అందం, నటన, స్క్రీన్ ప్రజెన్స్ ఇలా అన్నింటిని కలగలపి ఆమె ఒక అద్భుతమైన, అందమైన నటిగా అందరి హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు.

భారత నెట్‌బాల్ మాజీ కెప్టెన్ నుంచి ఈ స్థాయి వరకు ఎదిగిన ప్రాచి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఇక ఈ సాంగ్‌లో ఆమెతో పాటు బిగ్ బాస్ తెలుగు 8 విజేత నిఖిల్ (Nikhil)కూడా కనిపించారు. అతని లుక్స్, డ్యాన్స్, స్క్రీన్ ప్రజెన్స్‌‌తో పాటకు మరింత స్పెషల్ అట్రాక్షన్ తీసుకు వచ్చాయి. ప్రాచి, నిఖిల్ కలిసి ఈ మెలోడీ గీతాన్ని వీక్షకులకు నచ్చేలా, మెచ్చేలా మలిచారు. ఈ పాట విజువల్‌గా అద్భుతంగా ఉండటమే కాకుండా వినసొంపుగానూ ఉండి శ్రోతల్ని మెప్పిస్తోంది. ‘తేనెల వానలా’(thenela vanala) పాటను జీ మ్యూజిక్ నిర్మించింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అవుతోంది.

Next Story