బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మెగా హీరో.. పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-12-29 12:04:47  IST  )

మెగా హీరో అల్లు శిరీష్ (Allu Sirish)త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే.

బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మెగా హీరో.. పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, సినిమా: మెగా హీరో అల్లు శిరీష్ (Allu Sirish)త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. గత కొద్ది కాలంగా నయనిక(Nayanika)తో ప్రేమలో ఉన్న శిరీష్ పెద్దలను ఒప్పించి అక్టోబర్ 30న నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ వేడుకల్లో ఇరు కుటుంబాల సన్నిహితులు, బంధువులు పాల్గొనగా.. ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత నుంచి వీరిద్దరు పలు ఫంక్షన్స్‌కు కలుస్తూ.. అప్పుడే పర్సనల్ లైఫ్‌లో బిజీ అయిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో.. నెటిజన్లు పెళ్లి ఎప్పుడంటూ పలు ప్రశ్నలు వేస్తున్నారు. తాజాగా, ఈ విషయంపై అల్లు శిరీష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించి సర్‌ప్రైజ్ ఇచ్చారు.

త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుపుతూ గమ్మత్తుగా తేదీని రివీల్ చేశాడు. అల్లు బాబీ కూతురు, ఐకాన్ స్టార్ కూతురు అర్హా కలిసి బాబాయ్ నీ పెళ్లి ఎప్పుడు అని ట్రెండింగ్ సాంగ్‌తో డాన్స్ చేస్తూ అడగ్గా.. దానికి అల్లు శిరీష్, అయాన్ డ్యాన్స్ చేస్తూ వచ్చే ఏడాది మార్చి6న అని పెళ్లి డేట్ రివీల్ చేస్తాడు. ఆ తర్వాత ఇద్దరు కూతుర్లు బాబయ్ నీ సంగీత్ ఎప్పుడు అని ప్రశ్నించగా.. మనం సౌత్ ఇండియన్స్.. సంగీత్ లాంటివి చేసుకోము’’ అని డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఇక అది చూసిన వారంతా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారు కావచ్చని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఎక్కడ చేసుకుంటారో చెప్పండని ప్రశ్నిస్తున్నారు.

Next Story