ప్రభాస్- కృతిసనన్‌ల పెళ్లి.. మాల్దీవుల్లో వచ్చేవారమేనట!

by Disha Web Desk 10 |
ప్రభాస్- కృతిసనన్‌ల పెళ్లి.. మాల్దీవుల్లో వచ్చేవారమేనట!
X

దిశ, సినిమా : స్టార్ నటులు ప్రభాస్, కృతిసనన్ మ్యారేజ్ ఇష్యూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే వీరిద్దరూ ప్రేమలో పడ్డారంటూ నెట్టింట హంగామా నడిచింది. అంతేకాదు వీరిద్దరి కలయికలో వస్తున్న 'ఆదిపురుష్' ప్రమోషన్స్‌లోనూ ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నట్లుగానే బిహేవ్ చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా ఉమైర్ సంధు చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ మేరకు 'బ్రేకింగ్ న్యూస్: #కృతిసనన్ & #ప్రభాస్ నిశ్చితార్థం వచ్చే వారం మాల్దీవుల్లో జరగనుంది. సో హ్యాపీ ఫర్ దెమ్' అంటూ ఉమైర్ రాసుకొచ్చిన ట్వీట్‌ తెగ వైరల్ అవుతోంది. కాగా దీనిపై స్పందిస్తున్న ఫ్యాన్స్.. 'నీకు ఏమీ పని లేకపోతే మాకు అప్డేట్స్ ఏవైనా చెప్పు. ఊరికే ఫేక్ న్యూస్‌తో మా బ్రెయిన్ తినకు', 'నీకేమైనా వాళ్లు ఫోన్ చేసి చెప్పారా' అంటూ నెగెటీవ్‌ కామెంట్లతో ఆడేసుకుంటున్నారు.


Next Story

Most Viewed