- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Brahmanandam : కన్నీళ్లు పెట్టుకున్న బ్రహ్మానందం.. ?
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం బర్త్ డే సందర్భంగా 'రంగమార్తాండ'లో బ్రహ్మీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో బ్రహ్మానందం హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ పెట్టుకుని

దిశ, సినిమా: హాస్యబ్రహ్మ బ్రహ్మానందం బర్త్ డే సందర్భంగా 'రంగమార్తాండ'లో బ్రహ్మీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో బ్రహ్మానందం హాస్పిటల్ బెడ్‌పై సెలైన్ పెట్టుకుని కన్నీళ్లు నిండిన కళ్లు, గద్గద స్వరంతో చెప్పిన డైలాగ్‌కు ప్రేక్షకుల ఫిదా అవుతున్నారు. అలాగే కృష్ణవంశీ డైరెక్షన్‌లో ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన మూవీలో బ్రహ్మానందం చెప్పిన ఎమోషనల్ డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.
ఇటీవలే సినిమా నుంచి మెగాస్టార్ చిరంజీవి చెప్పిన షాయిరీ, అలాగే రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ నటించిన సాంగ్ 'నన్ను నన్నుగా'కు భారీ స్పందన లభిచింది. మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించిన ఈ సినిమాకు ఆకెళ్ల శివప్రసాద్ సంభాషణలు అందించగా లక్ష్మీ భూపాల, కాకర్ల శ్యామ్, భల్లా విజయ కుమార్ సాహిత్యం అందించారు. రంగస్థల కళాకారుల జీవితాల నేపథ్యంలో సాగే ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.






