సస్పెన్స్ థ్రిల్లర్‌ ‘ఇంద్రావతి’ మూవీ నుంచి డబుల్ అప్డేట్స్ ఇచ్చిన మేకర్స్..

by Mallepaka Hamsa |

కొత్తదనానికి పెద్దపీట వేస్తూ, సీనియర్ నటుల అనుభవాన్ని జోడిస్తూ ద‌ర్శక‌-నిర్మాత నంది వెంకట్ రెడ్డి(Nandi Venkat Reddy) ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

సస్పెన్స్ థ్రిల్లర్‌ ‘ఇంద్రావతి’ మూవీ నుంచి డబుల్ అప్డేట్స్ ఇచ్చిన మేకర్స్..
X

దిశ, సినిమా: కొత్తదనానికి పెద్దపీట వేస్తూ, సీనియర్ నటుల అనుభవాన్ని జోడిస్తూ ద‌ర్శక‌-నిర్మాత నంది వెంకట్ రెడ్డి(Nandi Venkat Reddy) ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. శ్రీ శివసాయి ఫిల్మ్స్ బ్యానర్‌పై నంది వెంకట్ రెడ్డి స్వయంగా దర్శకత్వం-నిర్మాణం చేస్తున్న చిత్రం ‘ఇంద్రావతి’(Indravathi). మారంరెడ్డి వెంకటేశ్వర్లు, వడ్ల సిద్ధార్థ, యందూరి నిహారిక చౌదరి, సుష్మ కథానాయకులుగా నటిస్తున్న ఈ మూవీలో సీనియర్ నటులు సుమన్, లంకెల అశోక్ రెడ్డి, ఘర్షణ శ్రీనివాస్, టార్జాన్, దిల్ రమేష్, చిత్రం శీను, అర్చన, ధనుంజయ, నగేష్ తదితరులు కీలక పాత్రల్లో కనువిందు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ చిత్రం ఫస్ట్‌ లుక్ పోస్టర్‌తో పాటు టీజర్‌ను ఆవిష్కరించారు. చీఫ్ గెస్ట్‌గా హాజరైన దర్శక-నిర్మాత సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ.. “టీజర్ అద్భుతంగా ఉంది. సినిమా క్వాలిటీగా తెరకెక్కుతోంది. నంది వెంకట్ రెడ్డి గారు గతంలో తీసిన ‘తారకేశ్వరి’ సినిమా పాటలను మా అన్విక ఆడియో ద్వారా విడుదల చేశాం.

చిన్న సినిమాలతో ప్రారంభమైన శ్రీ శివసాయి ఫిల్మ్స్ బ్యానర్ ఇప్పుడు పెద్ద స్థాయికి చేరాలి. మొత్తం చిత్ర యూనిట్ ఒక కుటుంబంలా కలిసికట్టుగా పనిచేస్తోంది. ‘ఇంద్రావతి’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్!” అని హృదయపూర్వకంగా ఆకాంక్షలు తెలిపారు. అనంతరం.. సీనియర్ నటుడు ఘర్షణ శ్రీనివాస్ మాట్లాడుతూ, “వెంకట్ రెడ్డి గారు తమ వద్ద ఉన్న వనరులను స‌రైన విధంగా ఉపయోగించుకుని నాణ్యతతో సినిమాలు తీస్తున్నారు. అవకాశం ఉన్నంత వరకు క్వాలిటీని రాజీ పడకుండా చేసే వారే నిజమైన క్రియేటివ్ ప‌ర్స‌న్స్. సీనియర్ ఆర్టిస్టులను గౌరవిస్తూనే, నూతన తరం ప్రతిభకు అవకాశాలు కల్పిస్తూ మంచి సినిమాలు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ గౌరవించే మంచి మనిషి వెంకట్ రెడ్డి గారు. ‘ఇంద్రావతి’ టీమ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు” అని కొనియాడారు.

Next Story