‘ఓజీ’ సినిమా బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. క్రూరంగా, ప్రేమగా ఉండనుందంటూ గూస్ బంప్స్ తెప్పిస్తోన్న పోస్టర్

by Mallepaka Hamsa |   (  Updated:2025-09-14 05:58:37  IST  )

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న సినిమా ‘ఓజీ’.

‘ఓజీ’ సినిమా బిగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. క్రూరంగా, ప్రేమగా ఉండనుందంటూ గూస్ బంప్స్ తెప్పిస్తోన్న పోస్టర్
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న సినిమా ‘ఓజీ’. సుజిత్(Sujith) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈమూవీలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan)హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, షాన్ కక్కర్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న థియేటర్స్ విడుదల కాబోతుంది.

దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ అంచనాలను మరింత పెంచుతున్నారు. తాజాగా, ‘ఓజీ’ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తూ చిత్రబృందం ఈ చిన్న క్లిప్‌ను షేర్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన బ్లాక్ బస్టర్ సాంగ్ సెప్టెంబర్ 15న సాయంత్రం 4:50 గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఓ రోడ్‌పై కారు వెళ్లగా.. వెంటనే రెండు గన్స్ పట్టుకుని ఉండగా.. అందులో బుల్లెట్లకు బదులుగా గులాభీ పువ్వులు ఉంటాయి. గన్స్ అండ్ రోజెస్‌తో అత్యంత క్రూరంగా, ప్రేమగా ఈ సాంగ్ ఉండబోతున్నట్లు చిత్రబృందం చెప్పకనే చెప్పింది. ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు గూస్ బంప్స్‌ను తెప్పిస్తోందని కామెంట్లు పెడుతున్నారు.

Next Story