- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్న ‘ఓజీ’ మూవీ మేకర్స్.. ఆ స్పెషల్ డే నాడే అప్డేట్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న చిత్రాలను పూర్తి చేస్తూ దూసుకుపోతున్నారు.

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఆయన చేతిలో ఉన్న చిత్రాలను పూర్తి చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘ఓజీ’. సుజిత్(Sujith) దర్శకత్వంలొ తెరకెక్కుతున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్(Priyanka Mohan) హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ సెప్టెంబర్ 25న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ‘ఓజీ’ పనులు త్వరగా పూర్తి చేస్తూ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా, ‘ఓజీ’ మూవీ మేకర్స్ పవర్ స్టార్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆగస్టు 27న వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేసి ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నట్లు టాక్. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.






