‘కుమ్కీ’ సీక్వెల్ ప్రకటించిన మేకర్స్... కొత్త లోకంలోకి తీసుకెళ్తామంటూ హైప్ పెంచుతున్న పోస్ట్

by Mallepaka Hamsa |

ప్రభు సోలమన్ (Prabhu Solomon)దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుమ్కీ’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

‘కుమ్కీ’ సీక్వెల్ ప్రకటించిన మేకర్స్... కొత్త లోకంలోకి తీసుకెళ్తామంటూ హైప్ పెంచుతున్న పోస్ట్
X

దిశ, సినిమా: ప్రభు సోలమన్ (Prabhu Solomon)దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుమ్కీ’ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. లక్ష్మీ మీనన్, విక్రమ్ ప్రభు జంటగా నటించిన ఈ సినిమా 2012లో వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో మూవీ మేకర్స్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. మళ్లీ సినీ ప్రియులను కొత్త లోకంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ‘కుమ్కీ-2’ (Kumki-2)మోషన్ పోస్టర్‌ను షేర్ చేశారు. ‘‘కుమ్కిని మీరు ఎంతగా ప్రేమించారో, ఎంతగా ఆదరించారో మనందరికీ తెలుసు. ఇప్పుడు మిమ్మల్ని కొత్త ప్రపంచంలో తీసుకెళ్లడానికి మేము తిరిగి వచ్చాము! కుమ్కి2 మోషన్ పోస్టర్‌ను అందిస్తున్నాము. అడవిలోకి ఒక మాయా సాహసం, మళ్ళీ జన్మించిన కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాము. ఈ చిత్రం భావోద్వేగాలను, ప్రకృతితో మీ బంధాన్ని, మీరందరూ ప్రేమించే మాయాజాలాన్ని తిరిగి తీసుకువస్తుందని హామీ ఇస్తున్నాము’’ అని రాసుకొచ్చారు. కాగా, ఈ సినిమాను పెన్ మూవీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది.

Next Story