- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘భోగి’ అప్డేట్ ఇచ్చి అంచనాలను పెంచిన మేకర్స్..
స్ట్రైకింగ్ మోనోక్రోమ్‌లో చిత్రీకరించిన ఫ్రేమ్‌లో శర్వా రోడ్డుపై నిలబడి, భుజంపై హ్యామర్‌ను పట్టుకుని కనిపిస్తున్నారు

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand), ఇప్పుడు తొలిసారిగా యాక్షన్ స్పెషలిస్ట్ సంపత్ నందితో కలిసి ‘భోగి’ (Bhogi)అనే భారీ పాన్-ఇండియన్ పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. సినిమా వరల్డ్‌ని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ స్పార్క్ కాన్సెప్ట్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ కీలక షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్‌ను నిర్మించారు. ఈ షెడ్యూల్‌లో రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్‌లు ఉండగా, వాటికి ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ భారీ షెడ్యూల్ పూర్తయ్యే వరకు శర్వా నాన్ స్టాప్‌గా షూటింగ్‌లో పాల్గొననున్నారు. స్ట్రైకింగ్ మోనోక్రోమ్‌లో చిత్రీకరించిన ఫ్రేమ్‌లో శర్వా రోడ్డుపై నిలబడి, భుజంపై హ్యామర్‌ను పట్టుకుని కనిపిస్తున్నారు. పొగ, ధూళి మధ్య అతని సిల్హౌట్ ఫెరోషియస్ ఇంటెన్సిటీని ప్రజెంట్ చేస్తోంది. అతని ముందువైపు దర్శకుడు సంపత్ నంది, స్టంట్ డైరెక్టర్ దిలీప్ సుబ్బరాయన్ కనిపిస్తున్నారు. ఈ ఇమేజ్ సినిమాకి ఉండే యాక్షన్ ఎలిమెంట్స్, ఇంటెన్స్సిటీని హైలైట్ చేస్తోంది. ఈ పోస్టర్‌తో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి.






