- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సమయం ఆసన్నమైందంటూ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..
రామ్ పోతినేని(Ram Pothineni)కి గత కొద్ది కాలంగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్ అందుకోలేకపోతున్నారు.

దిశ, సినిమా: రామ్ పోతినేని(Ram Pothineni)కి గత కొద్ది కాలంగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్ అందుకోలేకపోతున్నారు. వరుసగా.. నాలుగు చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ (AndhraKingTaluka)మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా.. డిజాస్టర్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నవీన్ యెర్నేనీ, రవిశంకరు నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో రావు రమేష్, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్, ఉపేంద్ర, మురళి శర్మ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం.. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్లు, సాంగ్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. దీంతో ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. చిత్రబృందం ట్రైలర్‌కు సమయం ఆసన్నమైందంటూ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘ఆంధ్రాకింగ్ తాలూకా’ ట్రైలర్ నవంబర్ 18న రాబోతున్నట్లు తెలుపుతూ రామ్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక ఇందులో ఆయన సైకిల్‌ను ఎత్తి భుజంపై పెట్టుకుని ఓ పెద్ద చెట్టు వెనకాల నుంచి మెట్లపై నడుచుకుంటూ వస్తున్నట్లు ఉన్న స్టైలీష్ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతుండగా.. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.






