- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ తేదీన ‘ఎపిక్’ సినిమాను థియేటర్స్‌లోకి తీసుకురాబోతున్న మేకర్స్!
ఈ సినిమాను సెప్టెంబర్ 3న థియేటర్స్‌లోకి తీసుకువచ్చేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్‌గా మారాయి.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న సినిమా ‘ఎపిక్’. ‘బేబీ’ సూపర్ హిట్ మూవీ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న రెండో ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అయింది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూర్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై నాగవంశీ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ఆనంద్ దేవరకొండ మునుపెన్నడూ కనిపించని ఒక సరికొత్ మేకోవర్‌లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు హిషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. అయితే లండన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆధునిక ప్రేమకథగా రాబోతుంది.
ప్రేమ, సంబంధాలు, యువత ఆలోచనా విధానం వంటి అంశాలను కొత్త కోణంలో చూపించనున్నారు. మోస్ట్ యాంటిసిపేటెడ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, టీజర్ విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘సంచారమే’ సోషల్ మీడియాను షేక్ చేయడంతో పాటు అంచనాలను పెంచేశాయి. అయితే ఈ సినిమా మొదట జూలై 24న విడుదల కాబోతుందని వార్తలు వచ్చినప్పటికీ మూవీ మేకర్స్ మాత్రం వీకెండ్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను సెప్టెంబర్ 3న థియేటర్స్‌లోకి తీసుకువచ్చేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్‌గా మారాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






