‘బిగ్‌బాస్’ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ఛాన్స్ ఇచ్చిన మేకర్స్.. ఇలా చేస్తే లైవ్ షో చూడొచ్చట!

by Disha Web Desk 6 |
‘బిగ్‌బాస్’ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ఛాన్స్ ఇచ్చిన మేకర్స్.. ఇలా చేస్తే లైవ్ షో చూడొచ్చట!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ‘బిగ్‌బాస్-7’ సీజన్ రాబోతున్న విషయం తెలిసిందే. (సెప్టెంబర్ 3) నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సీజన్‌కు కూడా కింగ్ నాగార్జునే హోస్ట్ గా వ్యవహారించనున్నారు. ఈ సీజన్ మిగతా సీజన్లతో పోలిస్తే కాస్త డిఫరెంట్ గా ఉండబోతుందని ప్రోమోస్ చూస్తేనే అర్థమవుతుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరనేది ఇవాళ తేలనుంది. ఈ క్రమంలో బిగ్‌బాస్ ప్రియులకు మేకర్స్ అదిరిపోయే బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు. సెప్టెంబర్ 4 నుంచి బిగ్ బాస్ బజ్ స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ బజ్ ఫాలో అయ్యేవారికి ఆటను లైవ్‌గా సెట్‍లో చూసే అవకాశం కల్పించనున్నారు మేకర్స్.

తాజాగా దీనికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. ‘‘ఈసారి ఆట ఆ హౌజ్‍లో మాత్రమే కాదు. మీ హౌజ్‍లో కూడా. బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ లైవ్‍లో సెట్ నుంచి చూడాలని అనుకుంటున్నారా. అయితే ప్రతిరోజు బిగ్ బాస్ బజ్‍లో మేము అడిగే ప్రశ్నలకు ఫేస్‍బుక్ లైవ్‍లో సరైనా సమాధానం చెప్పిన లక్కీ విన్నర్ వీకెండ్ ఎపిసోడ్‍ను లైవ్ ఆడియెన్స్ గా చూడొచ్చు’’ అని వీడియోలో పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 10, సాయంత్రం 6 గంటలకు స్టార్ మా మ్యూజిక్‍లో బిగ్ బాస్ బజ్ టెలికాస్ట్ కానుంది. ఈ సారి ఎవరెవరు కంటిస్టెంట్స్‌గా వస్తున్నారోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Next Story

Most Viewed