22 ఏళ్ల తర్వాత మ్యాజిక్ రిపీట్.. ‘కరుప్పు’లో త్రిషను అందుకే తీసుకున్నానంటూ దర్శకుడి కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-16 16:20:30  IST  )

నేను త్రిషతో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకున్నాను, కానీ ఇప్పటికి కుదిరింది. స్క్రిప్ట్ చెప్పగానే ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

22 ఏళ్ల తర్వాత మ్యాజిక్ రిపీట్.. ‘కరుప్పు’లో త్రిషను అందుకే తీసుకున్నానంటూ దర్శకుడి కామెంట్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, దర్శకుడు ఆర్జే బాలాజీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ మూవీ ‘కరుప్పు’ . తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ‘వీరభద్రుడు’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. మే 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతున్న ఈ మూవీ గురించి తాజాగా దర్శకుడు ఆర్జే బాలాజీ పలు ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ సినిమాలో సౌత్ క్వీన్ త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. సూర్య, త్రిష జోడీని మళ్ళీ వెండితెరపై చూడాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన ‘ఆరు’ చిత్రం తర్వాత, దాదాపు 22 ఏళ్ల విరామం అనంతరం మళ్ళీ ఈ చిత్రంలో కలిసి కనిపిస్తుండటం విశేషం. దీనిపై బాలాజీ స్పందిస్తూ.. "నేను త్రిషతో ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకున్నాను, కానీ ఇప్పటికి కుదిరింది. స్క్రిప్ట్ చెప్పగానే ఆమె వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

షూటింగ్ పూర్తయినప్పటికీ, ఆమె తరచుగా సెట్స్‌కు వచ్చి మా టీమ్‌ను ఎంకరేజ్ చేసేవారు’’ అని తెలిపారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా మొదట ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌ను ఎంపిక చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. దీని గురించి బాలాజీ వివరిస్తూ.. "‘మూకుతి అమ్మన్’ విడుదలయ్యాక నేను ఏఆర్ రెహమాన్‌ను కలిశాను. ఆ సమయంలోనే కలిసి వర్క్ చేయాలని ఫిక్స్ అయ్యాం. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత ‘కరుప్పు’ కోసం ఆయన్ని కలిశా. నేను, రెహమాన్ సార్ కలిసి వర్క్ చేయాలని చాలా ఆశపడ్డాము. కానీ షూటింగ్ సమయంలో ఆయన తన వ్యక్తిగత కారణాల వల్ల ‘నేను ఈ సినిమాకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేను’ అని సున్నితంగా చెప్పారు. ఆ మాట విన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. అయితే షూటింగ్ మధ్యలో ఒక పాట అత్యవసరం కావడంతో, మేము సాయి అభ్యంకర్‌ను మ్యూజిక్ డైరెక్టర్‌గా తీసుకున్నాము" అని క్లారిటీ ఇచ్చారు. సూర్య-త్రిష కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

Read More.. ఉడుత బొమ్మతో విజయ్‌ను విమర్శించిన నటి.. పోలీసుల ఎంట్రీతో ఊహించని ట్విస్ట్

Next Story