ఆమె మరణం చాలా బాధాకరం.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్

by Mallepaka Hamsa |

గత కొద్ది కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా, ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

ఆమె మరణం చాలా బాధాకరం.. చిరంజీవి ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా, ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) తల్లి అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనకరత్నమ్మ (Kanakaratnamma)మృతి చెందారు. వయసు మీద పడటంతోనే ఆగస్టు 30 కన్నుమూసినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘మా అత్తయ్య గారు.. కీ.శే అల్లు రామలింగయ్య గారి సతీమణి కనకరత్నమ్మ గారు శివైక్యం చెందటం ఎంతో బాధాకరం. మా కుటుంబాలకు ఆమె చూపిన ప్రేమ, ధైర్యం, జీవిత విలువలు ఎప్పటికీ మాకు ఆదర్శం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతిః’’ అని రాసుకొచ్చారు. కాగా, కననరత్నం ను చూసేందుకు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ ఇంటికి చేరుకుంటున్నారు. ఇక కనకరత్నం అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చిరంజీవి చేస్తున్నారు. ఇక వారితో పాటు ఆమె మరణవార్తను తెలుసుకున్న సినీ సెలబ్రిటీలు కూడా అల్లు అరవింద్ ఇంటికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు.

link

Next Story