సింహం గాయపడింది.. వేట మొదలైంది! హైప్ పెంచేసిన తరుణ్ భాస్కర్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్(Tarun Bhaskar) ఇప్పుడు హీరోగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు.

సింహం గాయపడింది.. వేట మొదలైంది! హైప్ పెంచేసిన తరుణ్ భాస్కర్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్(Tarun Bhaskar) ఇప్పుడు హీరోగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం ‘ఓంశాంతి శాంతి’ జనవరి 30న విడుదలై బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ జోష్‌లో ఉండగానే, తరుణ్ తన తదుపరి క్రేజీ ప్రాజెక్టుపై క్లారిటీ ఇచ్చి ఫ్యాన్స్‌లో హైప్ పెంచేశారు. తాజా సమాచారం ప్రకారం.. సప్త అష్వ మీడియా వర్క్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ కొత్త చిత్రంలో ఒక ఆసక్తికరమైన కాంబినేషన్ సెట్ అయిందని తెలుస్తోంది. వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నారట.

అలాగే ‘చిట్టి’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. తరుణ్ తన మార్క్ కామెడీతో పాటు ఈసారి ఏదో కొత్తగా ట్రై చేస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో తరుణ్ భాస్కర్ షేర్ చేసిన ‘గాయపడ్డ సింహం’ ఫొటో ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది సినిమా టైటిల్ లేక కథలోని కీలకమైన పాయింటా అనేది తెలియాల్సి ఉంది. అయితే, ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ ఫిబ్రవరి 7న (రేపు) సాయంత్రం 4గంటలకు సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేయబోతున్నారు. ప్రకటనతోనే రచ్చ చేస్తున్న తరుణ్ భాస్కర్ సినిమా కోసం నెటిజన్లలో ఆసక్తి నెలకొంది.

Next Story