కేటీఆర్ ఎన్ని కోట్లు మింగాడో బయటపెట్టమంటారా..? : బండ్ల గణేష్

by Disha Web Desk 10 |
కేటీఆర్ ఎన్ని కోట్లు మింగాడో  బయటపెట్టమంటారా..? : బండ్ల  గణేష్
X

దిశ,వెబ్ డెస్క్: బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. " పవర్ లేని పవర్ ప్రజెంటేషన్ ఎందుకు సార్. మాట్లాడితే గత పాలకులు గత పాలకులు ఎన్ని సార్లు మాట్లాడతారు. ఆ మాటకి కూడా విసుగు వస్తుంది. గత పదేళ్ల నుంచి మేము ఈ రాష్ట్రాన్ని ఏమి అభివృద్ధి చేసామో చెప్పండి.. మేము చెప్తాం.. గత పదేళ్ల నుంచి మీరేం దోచుకున్నారో? మీరు ఆర్ధికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో.. మీరు ఆర్ధికంగా ఎక్కడ నుంచి ఎక్కడ ఉన్నారో.. మీ నాయకులు గాని మీరు గాని, మీ జీవన విధానం ఎంత మారిపోయిందో.. ? తెలంగాణ ప్రజలు ఎంత వెనుక పడ్డారో? మీరెంత ముందుకు పోయారో మేము చెప్తాం. మేము చెప్పాం కాబట్టే.. జనం నమ్మారు కాబట్టే నిజాన్ని తీసుకున్నారు కాబట్టే.. మాకు అధికారం చేపట్టారు. అధికారం చేపట్టి నెల రోజులు కాకుండానే.. మీకు ఎందుకు సార్ అంత ఆత్రుత.. ఎందుకంత బాధ.. ఎందుకంత భయం.. కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగ పరిపాలిస్తుందనా?కాంగ్రెస్ మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉన్నారనా?అనుక్షణం అందరికి న్యాయం చేస్తున్నారనా? ప్రజలందరూ సుఖ సంతోషాలతో కల కల లాడుతున్నారనా? ఆగండి.. వెయిట్ చేయండి.. టైం ఇవ్వండి.. అద్భుతంగ చేస్తాం" అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు.

Read More..

కృష్ణంరాజును సొంత కూతురిలా చూసుకున్న ఉపాసన.. మరణానికి ముందు ఆయన ఏం చెప్పారంటే..


Next Story

Most Viewed