- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.100 కోట్లు ఇచ్చినా ఆ హీరోతో రొమాన్స్ చేయను అని తెగేసి చెప్పిన లేడీ సూపర్ స్టార్.. అతనెవరంటే
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanathara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘లక్ష్మి’(Laxmi) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

దిశ, వెబ్‌డెస్క్: లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanathara) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘లక్ష్మి’(Laxmi) సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన ఫస్ట్ మూవీతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాత ఎన్నో మంచి విజయాలు సాధించిన చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. అయితే ఈ భామ రీసెంట్‌గా ‘జవాన్’(Jawan) మూవీతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఎంతగా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే.
ప్రస్తుతం ఈ అమ్మడు రాకింగ్ స్టార్ యష్(Yash) నటిస్తున్న ‘టాక్సిక్’(Toxic) మూవీలో నటిస్తుంది. యష్‌కు అక్కగా ఈ బ్యూటీ అలరించనుంది. ఇక ఈ ముద్దుగుమ్మ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే డైరెక్టర్ విగ్నేష్ శివన్(Vignesh Shivan)తో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకుంది. ఆ తర్వాత స్వరోగసి ద్వారా ఇద్దరు బాబులకు తల్లి కూడా అయింది. ప్రస్తుతం ఓ పక్కా సినిమాలు మరో పక్కా ఫ్యామిలీతో లైఫ్‌ను లీడ్ చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..
స్టార్ హీరో శరవణన్(sharavanan)తో నటించడానికి రూ.100 కోట్లు ఇచ్చినా నటించనని తెగేసి చెప్పిందట ఈ భామ. అయితే ‘ది లెజెండ్’(The Legend) సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైన ఆయన.. తన చిత్రంలో నయనతారను హీరోయిన్‌గా తీసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడట. కానీ నయన్ అందుకు ఒప్పుకోలేదట. అంతేకాదు రూ.100 కోట్లు ఇచ్చినా అతనితో రొమాన్స్ చేయనని చెప్పేసిందట. దీంతో నయనతారకు బదులుగా, బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా(Urvashi Rauthela) శరవణన్ సరసన హీరోయిన్‌గా నటించింది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






