మరోసారి బాలీవుడ్‌ను షేక్ చేయబోతున్న లేడీ సూపర్ స్టార్!

by Mallepaka Hamsa |

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో చేస్తున్న ప్రాజెక్ట్‌లో నయనతార పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందట.

మరోసారి బాలీవుడ్‌ను షేక్ చేయబోతున్న లేడీ సూపర్ స్టార్!
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సరసన ఓ భారీ ప్రాజెక్ట్ చేయనుంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇకఇప్పటికే నయన్, షారుఖ్ ఖాన్ సూపర్ హిట్ సినిమా ‘జవాన్’ తో హిందీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ సినిమాలో బాలీవుడ్ బాద్‌షాకు పోటీగా ఆమె చేసిన స్టైలిష్ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులకు థియేటర్లలో హైలెట్‌గా నిలిచాయి. ఇప్పుడు ఆమె మరోసారి బాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌తో హిందీ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో చేస్తున్న ప్రాజెక్ట్‌లో నయనతార పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందట.

‘జవాన్’ తరహాలోనే ఇందులో కూడా నయనతార యాక్షన్ ప్యాక్డ్ అవతారంలో కనిపించనుందని టాక్. ఈ సినిమా కోసం ఆమె డూప్ లేకుండా, ఫైట్ మాస్టర్స్ సమక్షంలో స్వయంగా యాక్షన్ స్టంట్స్ చేస్తోందని సమాచారం. ఇప్పటికే సెట్స్‌లో ఆమె చేసిన యాక్షన్ సీక్వెన్స్ చూసిన చిత్ర బృందం నయనతార నటనకు ఫిదా అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు నయనతార మరోసారి బాలీవుడ్‌ను షేక్ చేయడం ఖాయం అని అంటున్నారు. కాగా.. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. తన ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్‌పై కుల్దీప్ రాథోడ్‌తో కలిసి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఈద్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Next Story