- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాక్సాఫీసు వద్ద అల్లకల్లోలం సృష్టించిన ‘కింగ్‌డమ్’.. ఫస్ట్ డే కలెక్షన్స్‌పై మూవీ మేకర్స్ ట్వీట్
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom).

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’(Kingdom). ఈ సినిమా భారీ అంచనాల మధ్య జులై 31న థియేటర్స్‌లోకి వచ్చింది. ఎలాగైనా ఈ సారి హిట్ అందుకోవాలన్న కసితో విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని చేశాడు. అనుకున్నంటుగానే ‘కింగ్‌డమ్’ బాక్సాఫీసును షేక్ చేసింది. మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా రూ. 39 కోట్ల వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని తెలుపుతూ మూవీ మేకర్స్ ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ‘‘రాజు రాక అల్లకల్లోలం సృష్టించింది. ‘కింగ్‌డమ్’ ప్రేక్షకులను మెప్పించడంతో పాటు బాక్సాఫీసు బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది’’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న విజయ్ దేవరకొండ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక మొదటి షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ కలెక్షన్లు వీకెండ్‌లో మరింత పెరగనున్నాయి. కాగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటించింది. ఇందులో సత్యదేవ్ ప్రధాన పాత్రలో కనిపించాడు. ఈ యాక్షన్ డ్రామాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. ‘కింగ్‌డమ్’ ఊహించిన విధంగా ఘన విజయం సాధించడంతో మూవీ టీమ్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.






