- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ది కేరళ స్టోరీ హీరోయిన్‌కు షాక్.. సోషల్ మీడియాలో పర్సనల్ డాటా!
హార్ట్ ఎటాక్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోయిన్ ఆదాశర్మ తాజాగా రీలీజైన ‘‘ది కేరళ స్టోరీ చిత్రంలో నటించి మరింత పేరు సంపాదించుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోయిన్ ఆదాశర్మ తాజాగా రీలీజైన ‘‘ది కేరళ స్టోరీ చిత్రంలో నటించి మరింత పేరు సంపాదించుకుంది. ‘సదీస్తో సేన్ ది’ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాట్టింది. కేరళ రాష్ట్రంలో లవ్ జిహాద్ పెద్ద ఎత్తున జరు గుతుంది. హిందూ, క్రిస్టియన్ అమ్మాయిలను ముస్లిం యువకులు ప్రేమించి, వాళ్ళను ఉగ్రవాదులుగా మారుస్తున్నారనే అంశాలను ఈ మూవీలో చూపించారు. దీంతో కొన్ని రాజకీయ వర్గాలు, ముస్లిం కమ్యూనిటీ ఈ సినిమాని వ్యతిరేకిస్తున్నాయి. అయితే తాజాగా ఓ వ్యక్తి ఆదా శర్మనే టార్గెట్ చేశాడు. ఆమె పర్సనల్ ఇన్‌ఫర్‌మేషన్‌ను సోషల్ మీడియాలో పెట్టి..‘‘మరొసారి ముస్లింలకు వ్యతిరేకంగా సినిమాలు తీస్తే పర్యవసనాలు ఇంకా దారుణంగా ఉంటాయని’’ హెచ్చరించాడు. ఆ వ్యక్తిపై హీరోయిన్ సైబర్ క్రైమ్ విభాగంలో కంప్లైంట్ చేసింది.






