"The Kerala Story" బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్.. 3 రోజుల్లో ఎంతంటే..?

by Disha Web Desk 12 |
The Kerala Story బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్.. 3 రోజుల్లో ఎంతంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రకంపణలు సృష్టించిన కేరళ స్టోరీ సినిమా.. కోని రాష్ట్రాల్లో నిషేధాన్ని ఎదుర్కొనగా.. మరికొన్ని రాష్ట్రాల్లో నిబంధనల నడుమ విడుదలైంది. అదా శర్మ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. రిలీజైన మొదటి రోజే.. రూ. 8.03 కోట్ల వసూలు చేయగా.. శని, ఆదివారాల్లో థియోటర్లు సైతం భారీగా పెరగడంతో ఈ కలెక్షన్ల స్థాయి కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే మూడు రోజుల కలెక్షన్స్ ఎంత వచ్చాయో అఫీషియల్ గా ప్రకటించనప్పటికి.. ట్రేడ్ వెబ్‌సైట్ sacnilk నివేదించిన ప్రకారం.. ఈ సినిమా మూడు రోజుల్లో భారతదేశంలో దాదాపు రూ. 35.25 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

బాక్సాఫీస్ వద్ద రోజువారీ కలెక్షన్లు..

శుక్రవారం: రూ. 8.03 కోట్లు

శనివారం: రూ. 11.22 కోట్లు

ఆదివారం: రూ. 16.50 కోట్లు (ప్రారంభ అంచనా)

మొత్తం: 35.25 కోట్లు

Also Read..

‘Bhediya’ on OTT : ఎట్టకేలకు ఓటీటీలో వరుణ్‌ధావన్ ‘Bhediya’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Next Story

Most Viewed