దివాళా తీసిన ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్.. కష్టాలు మళ్లీ మొదలయ్యాయని..

by Disha Web Desk 10 |
దివాళా తీసిన ‘కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్.. కష్టాలు మళ్లీ మొదలయ్యాయని..
X

దిశ, సినిమా : ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి వివాదాలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాడు. పర్సనల్ విషయాలను కూడా పంచుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే తాను పూర్తిగా దివాళా తీసినట్లు చెప్పుకొచ్చాడు. ‘‘ది కశ్మీర్ ఫైల్స్’ ద్వారా సంపాదించిన డబ్బు పూర్తిగా.. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ‘ది వ్యాక్సిన్ వార్’ మీద పెట్టేశాను. ఎప్పటిలాగే బ్యాంక్‌రప్ట్ అయిపోయా. నేను, నా భార్య మళ్లీ అదే పరిస్థితికి వచ్చేశామని మాట్లాడుకున్నాం. సో.. తర్వాతి చిత్రానికి సంబంధించిన కష్టాలు మొదలయ్యాయి’ అని తెలిపాడు. కొవిడ్ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కూడా పొలిటికల్ బ్యాగ్రౌండ్‌ ఉంటుందని తెలుస్తోంది.

Read More: ‘జైలర్’ మూవీ క్లైమాక్స్‌లో బాలయ్య.. హాట్ బ్యూటీ శ్రీరెడ్డి కూడా..

Next Story

Most Viewed