అనిరుధ్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన జైలర్ సినిమా నిర్మాత

by Disha Web Desk 9 |
అనిరుధ్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన జైలర్ సినిమా నిర్మాత
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ చిత్రం బాక్సాఫీసు వద్ద ఎంతగా ఆడిందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. రజినీ నటించిన సినిమాల్లో ఈ మూవీనే భారీ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో నిర్మాత కళానిధి మారన్.. డైరెక్టర్ నెల్సన్‌కు కారును గిఫ్ట్ ఇచ్చారు. రజనీకాంత్‌కు ఓ చెక్‌తో పాటు కారు కూడా గిఫ్ట్‌గా ఇచ్చారు. తాజాగా అనిరుధ్‌కు ఒక కారు, చెక్‌ను బహుమతిగా ఇచ్చారు. దీంతో జైలర్ నిర్మాతది గొప్ప మనసు అని నెటిజన్లు పొగిడేస్తున్నారు. సినిమాకు వచ్చిన లాభాల్లో ఇలా చిత్రబృందానికి పంచిన నిర్మాతలు అరుదుగా ఉంటారని కామెంట్లు చేస్తున్నారు.

Read More: డబ్బులకోసం చూపించకూడనివన్నీ చూపిస్తుంది.. తమన్నాపై నటుడు షాకింగ్ కామెంట్స్



Next Story

Most Viewed