- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభాస్ విషయంలో జరిగిన ఇష్యూ ఇప్పటికీ నన్ను బాధపెడుతోంది.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్
నిత్యా మీనన్(Nithya Menen) ‘అలా మొదలైంది’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.

దిశ, సినిమా: నిత్యా మీనన్(Nithya Menen) ‘అలా మొదలైంది’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అందం, అభినయంతో అతి తక్కువ సమయంలోనే వరుస ఆఫర్లు దక్కించుకుని ఇండస్ట్రీలో మంచి క్రేజ్ రాబట్టుకుంది. హీరోయిన్, సింగర్‌గా గుర్తింపు తెచ్చుకుని పలు చిత్రాలతో హిట్స్‌ను తన ఖాతాలో వేసుకుంది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇటీవల ‘ఇడ్లీ కడై’(Idli Kadai) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిత్యా మీనన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన జీవితంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. ‘‘నాకు ఇండస్ట్రీలో ఓ పెద్ద దెబ్బ తగిలింది. ప్రభాస్ విషయంలో ఓ ఇష్యూ నన్ను ఇప్పటికీ బాధపెడుతోంది. నా గురించి జర్నలిస్టులు అలా రాయడం చూసి చాలా హర్ట్ అయ్యాను.
‘అలా మొదలైంది’ సినిమా వచ్చిన సమయంలో నేను చాలా చిన్నదాన్ని. అప్పుడే నేను కొత్తగా ఇండస్ట్రీకి వచ్చాను. ఫస్ట్ మూవీ అప్పుడు తెలుగు కూడా సరిగ్గా రాదు. తెలుగు సినిమాలు కూడా చూసింది లేదు. అదే సమయంలో ఓ ఇంటర్వ్యూలో నన్ను ప్రభాస్ గురించి అడిగితే నాకు తెలియదని చెప్పాను. ఆ విషయాన్ని పెద్దది చేశారు. నా అమాయకత్వాన్ని ఉపయోగించుకున్నారు. నేను ఏదో పెద్ద తప్పు చేసినట్టుగా న్యూస్ క్రియేట్ చేశారు. ఆ ఇష్యూతో హానెస్ట్‌గా అన్ని చోట్లు ఉండకూడదని అర్థమైంది. ఎక్కడా ఎలా ఉండాలో అలాగే ఉండాలని.. మాటల గారడీ చేస్తేనే నచ్చుతుందని తెలుసుకున్నా.
అక్కడ ఉన్న మీడియా వాళ్లకు కూడా తెలుసు నాకు తెలుగు రాదని.. ప్రభాస్ ఎవరో తెలియదని.. అందుకే నన్ను కావాలని అడిగారు. నాకు తెలియదు కాబట్టి తెలియదని చెప్పేశా.. ఆ విషయాన్ని పెద్దది చేసి ఏదేదో అనేశారు. దీంతో చాలా బాధపడ్డాను’’ అని చెప్పింది. ఇక ఆమె పర్సనల్ లైఫ్ విషయానికొస్తే..37 ఏళ్లు వచ్చినప్పటికీ ఇప్పటికీ నిత్యామీనన్ పెళ్లి చేసుకోకుండా బ్యాచ్‌లర్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది. అలాగే వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ తన సినీ కెరీర్‌పై ఫోకస్ మొత్తం పెట్టేసింది.






