- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
32 ఏళ్ల తర్వాత మళ్లీ బాలయ్య బాబు సినిమాలో కనిపించనున్న హీరోయిన్.. ఇది కదా అసలైన ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్
నందమూరి బాలకృష్ణ(Balakrishna), స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Sreenu) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘అఖండ 2’(Akhanda-2).

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ(Balakrishna), స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Sreenu) కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘అఖండ 2’(Akhanda-2). 2021లో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్, బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’(Akhanda)కు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతుండటంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రేక్షకుల్లో కూడా పార్ట్-2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే దీనిని 14రీల్స్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తుండగా.. బాలయ్య బాబు కూతురు ఎం. తేజస్విని సమర్పిస్తున్నారు. ఇక ఇందులో హీరోయిన్‌గా సంయుక్త మీనన్(Samyuktha Menon) నటిస్తోంది.
ఈ క్రమంలో ఈ మూవీకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. అఖండ-2లో విజయశాంతి(Vijayashanthi) కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే విషయమై గత నెలలోనే ప్రచారం జరగ్గా చిత్ర యూనిట్ స్పందించలేదు. అయితే తాజాగా ఈ విషయమై మళ్లీ జోరుగా ప్రచారం మొదలైంది. దాదాపు 32 ఏళ్ల తర్వాత ఈ జోడీ మళ్లీ నటించనున్నట్లు తెలుస్తోంది.
మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. బాలయ్య ఫ్యాన్స్ ఇది కదా అసలైన ఎంటర్‌టైన్‌మెంట్ అంటే అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా బాలకృష్ణ, విజయశాంతి జంటగా 1984లో వచ్చిన 'కథానాయకుడు'(Kathanayakudu) మూవీతో స్టార్ట్ చేసి 1993లో 'నిప్పురవ్వ'(Nippu Ravva) వరకు మొత్తం ఈ జోడీ 16 చిత్రాల్లో నటించారు. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో రెండు గోల్డెన్ జూబ్లీ చిత్రాలుండటం విశేషం.






