తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ‘కాంతార’ హీరోయిన్..

by Disha Web Desk 10 |
తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్న ‘కాంతార’ హీరోయిన్..
X

దిశ, సినిమా: గ‌త ఏడాది ఇండియ‌న్ సినిమా చ‌రిత్రలో అత్యధిక వ‌సూళ్లను రాబ‌ట్టిన సినిమాల్లో ‘కాంతార’ ఒకటి. రూ.16 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం రూ. 400 కోట్ల క‌లెక్షన్స్ రాబ‌ట్టింది. కన్నడ సినిమా అయినప్పటికీ అన్ని భాషల్లో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో హీరో రిష‌బ్ శెట్టితో పాటు హీరోయిన్ స‌ప్తమి గౌడ‌కు కూడా ప్రశంస‌లు ద‌క్కాయి. కాగా ఈ బ్యూటీ తాజాగా తెలుగులో ఓ మూవీకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్- వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో రాబోతున్న ‘త‌మ్ముడు’ సినిమాలో హీరోయిన్‌గా న‌టించ‌నుందట. అలాగే సీనియ‌ర్ హీరోయిన్ ల‌య నితిన్ కి అక్కగా క‌నిపించ‌నుందట. ఇక సెప్టెంబ‌ర్ 1 నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.


Next Story