‘ది ప్యారడైజ్’ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. నానికి జోడీగా కోలీవుడ్ బ్యూటీ!

by Mallepaka Hamsa |

వైవిధ్యమైన కథలతో వరుస విజయాలు అందుకుంటున్నారు నేచురల్ స్టార్ నాని.

‘ది ప్యారడైజ్’ సినిమాలో హీరోయిన్ ఫిక్స్.. నానికి జోడీగా కోలీవుడ్ బ్యూటీ!
X

దిశ, సినిమా: వైవిధ్యమైన కథలతో వరుస విజయాలు అందుకుంటున్నారు నేచురల్ స్టార్ నాని. ఓ వైపు హీరోగా నిర్మాతగా రాణిస్తూ..ప్రేక్షకులను అలరించేందుకు ముందుంటున్నారు. ప్రస్తుతం నాని(nani) ‘ది ప్యారడైజ్’ (The Paradise)సినిమా పనుల్లో ఫుల్ బిజీ అయిపోయారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో మోహన్ బాబు (Mohan Babu)విలన్‌గా శికంజ మాలిక్ పాత్రలో నటిస్తున్నారు. తిరుగుబాటు నాయకత్వంతో పాటు తల్లీ కొడుకుల అనుబంధం కథతో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ బజ్ క్రియేట్ అయింది. నాని, శ్రీకాంత్ ఒదెల కాంబోలో వచ్చిన ‘దసరా’ బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. వీరి కాంబోలో రాబోతున్న సెకండ్ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ కావడంతో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇందులో నాని ‘జడల్’ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే విడుదలైన అప్డేట్స్ అన్ని మంచి రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కానీ ఈ విషయంపై మూవీ మేకర్స్ మాత్రం అధికారికంగా స్పందించలేదు. దీంతో ఈ వార్తలు మరింత పెరిగాయి. ఈక్రమంలో.. తాజాగా, ఈ వార్తలకు బలం చేకూరుస్తూ కయాదు లోహర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. ‘ది ప్యారడైజ్’గ్లింప్స్‌ను షేర్ చేస్తూ.. హార్ట్ ఎమోజీలను జత చేయడంతో నానికి జోడీగా నటిస్తుందనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ విధంగా హింట్ ఇచ్చిందని నెట్టింట చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఈ జోడీ కనక ఫిక్స్ అయితే మూవీ కచ్చితంగా హిట్ అవుతుందని అంటున్నారు. కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళ, కన్నడ, స్పానిష్, బెంగాళీ, తమిళ విడుదల కాబోతుంది.

Next Story