గుడ్ న్యూస్ ప్రకటించిన హీరోయిన్.. ఆన్‌ది వే అంటూ పోస్ట్ పెట్టడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-07-11 16:13:56  IST  )

బాలీవుడ్ హీరోయిన్ పత్రలేఖ(Patralekha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

గుడ్ న్యూస్ ప్రకటించిన హీరోయిన్.. ఆన్‌ది వే అంటూ పోస్ట్ పెట్టడంతో కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ పత్రలేఖ(Patralekha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు నాను కి జాను, లవ్ గేమ్స్, బద్నామ్ గలి, సిటీ లైట్స్ వంటి చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఇటీవల ప్రతీక్ గాంధీ సరసన ‘ఫూలే’ (Phule)మూవీలో నటించి మెప్పించింది. ఈ సినిమా ఏప్రిల్ 25న విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉంటే.. పత్రలేఖ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. పత్రలేఖ, బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు(Raj Kumar Rao)ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరికి వివాహం జరిగి మూడేళ్లు అవుతున్నప్పటికీ పిల్లలు మాత్రం లేరు.

ఇదిలా ఉంటే.. తాజాగా, పాత్రలేఖ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గుడ్ న్యూస్ ప్రకటించింది. తాను తల్లి కాబోతున్నట్లు వెల్లడిస్తూ ‘బేబీ ఆన్ ది వే’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు వరుణ్ ధావన్, ఉర్ఫీ జావేద్, సునీతా రాజ్‌వర్, భూమి పెడ్నేకర్ కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, రాజ్ కుమార్ సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘మాలిక్’. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని పుల్కిట్ తెరకెక్కించారు. ఇందులో మానుషి చిల్లర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు గ్యాంగ్‌స్టర్‌గా చేస్తున్నాడు. దీనిని టిప్స్ ఫిల్మ్స్, నార్తర్ లైట్స్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై కుమార్ తౌరానీ, జే షెవాక్రమణి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 11న థియేటర్స్‌లోకి రాబోతుంది.

Next Story