- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రియురాలితో కొత్త జర్నీ స్టార్ట్ చేసిన హీరో.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi)గత కొద్ది కాలంగా వార్తల్లో నిలుస్తున్నారు.

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి (Jayam Ravi)గత కొద్ది కాలంగా వార్తల్లో నిలుస్తున్నారు. పర్సనల్ లైఫ్‌లో పలు వివాదాలు ఎదర్కొంటున్న ఆయన వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా, జయం రవి ఓ గుడ్ న్యూస్ ప్రకటించాడు. ‘రవిమోహన్ స్టూడియోస్’ (Ravimohan Studios)పేరుతో తన సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. ఈ వేడక ఘనంగా చెన్నైలో జరగ్గా.. ఈ ఈవెంట్‌కు కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, కార్తీ, శివకార్తీకేయన్, జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్, సుధా కొంగర, అథర్వ, సూర్య ముఖ్యఅథిథులుగా వచ్చారు. ఇక ఈ వేడుకను జయం రవి ప్రియురాలు సింగర్ కెనీషా (Kenisha Francis)కూడా రాగా..ఘనంగా దీపాలు వెలిగించి ప్రారంభించారు.
అంతేకాకుండా జయం రవి బ్యానర్‌లో రాబోతున్న రెండు ప్రాజెక్ట్స్‌ను కూడా వెల్లడించాడు. ఆయన హీరోగా చేస్తున్న సినిమాకు కార్తీక్ యోగి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో SJ సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక రెండవ ప్రాజెక్ట్‌లో ప్రముఖ కమెడియన్ యోగిబాబు లీడ్ రోల్ ప్లే చేస్తుండగా.. స్వయంగా జయం రవి దర్శకత్వం వహిస్తూ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం జయంరవి ప్రొడక్షన్ హౌస్ ప్రారంబోత్సవానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో వాటిని చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు. అలాగే కెనిషాను పెళ్లి చేసుకోమని సలహాలు ఇస్తున్నారు.






