ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న హార్ట్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘సంతాన ప్రాప్తిరస్తు’!

by Mallepaka Hamsa |

విక్రాంత్(Vikranth), చాందినీ చౌదరి(Chandini Chowdhury) జంటగా నటించిన ‘సంతాన ప్రాప్తిరస్తు’ (Santhana Praptirasthu)నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్న హార్ట్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘సంతాన ప్రాప్తిరస్తు’!
X

దిశ, సినిమా: విక్రాంత్(Vikranth), చాందినీ చౌదరి(Chandini Chowdhury) జంటగా నటించిన ‘సంతాన ప్రాప్తిరస్తు’ (Santhana Praptirasthu)నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచే మంచి స్పందన సొంతం చేసుకుంది. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్‌ను మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్వి ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే ప్రమోషన్లు చూసిన వాళ్లందరికీ ఈ సినిమా విషయమేమిటో బేసిక్ ఐడియా ఉన్నా.. సినిమాలో చూపించిన డ్రామా, ఎమోషన్, కంటెంట్ హాస్యం ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేశాయి.

సినిమా కథలో ప్రధాన అంశం.. నేటి యువ దంపతులు ఎదుర్కొంటున్న ‘ఇన్‌ఫర్టిలిటీ’ సమస్య. పెద్దలను కాదని పెళ్లి చేసుకున్న ఓ జంట, తమ ప్రేమను రుజువు చేసుకోవడానికి, కుటుంబాన్ని మళ్లీ కలపడానికి పిల్లలు పుడితే పెద్దలు అంగీకరిస్తారని ఆశపడుతుంది. కానీ కీలక సమయంలో వారికి ఎదురయ్యే సమస్య.. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం. ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఆ జంట కలిసి చేసిన ప్రయత్నాలు ఏంటి? వాళ్ల మధ్య వచ్చే ఫన్నీ సిచ్యుయేషన్స్ ఎలా ప్రస్టేషన్‌గా మారుతాయి? చివరికి వారి జీవితంలో ఏమి మార్పు వస్తుంది?అనే అంశాలపై కథ నడుస్తుంది. సినిమా ప్రధాన బలం హాస్యం-ఎమోషన్ బ్యాలెన్స్.

సీరియస్ సమస్య అయిన సంతానలేమిని ఎక్కడా సరదాగా చూపించకుండా, కొత్తగా పెళ్లైన దంపతుల్లో అవగాహన పెంచే విధంగా దర్శకుడు కథను నడిపారు. నేటి లైఫ్‌స్టైల్ ఒత్తిడి, ఉద్యోగ ప్రెషర్, ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలను ప్లాన్ చేయడంలో వచ్చే ఆలస్యం, దాని వల్ల కలిగే సమస్యలు ఇవన్నీ నిజ జీవితానికి దగ్గరగా చూపించారు. విక్రాంత్ నటన, చాందినీ చౌదరి నటించిన భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేశాయని సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. సీరియస్ టాపిక్‌ని చక్కగా హాండిల్ చేశారు. కపుల్స్ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా అనే రివ్యూలు ఇస్తున్నారు.

Next Story