- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టాలీవుడ్‌లో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న గ్లోబల్ స్టార్.. ‘పెద్ది’ పోస్టర్‌తో బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన డైరెక్టర్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చాడు.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చాడు. ‘చిరుత’ సినిమాతో 2007లో హీరోగా వచ్చి మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇక ఆ తర్వాత మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫేమ్ తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డులు కూడా లభించడం విశేషం. ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ (peddi) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈక్రమంలో.. నేటితో రామ్ చరణ్ ఇండస్ట్రీకి వచ్చి 18ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ బుచ్చిబాబు ‘పెద్ది’ సినిమా నుంచి కొత్త పోస్టర్ షేర్ చేసి మెగా అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ఇక ఇందులో రామ్ చరణ్ మాసిన జుట్టు, గడ్డంతో రస్టిక్ లుక్‌లో కనిపించారు. నల్ల కలర్, ఎర్రటి చారలు కలిగిన షర్ట్ ధరించి ముక్కుకు పోగుతో, బీడీ తాగుతూ రైల్వే ట్రాక్‌పై మాస్ లుక్‌లో నిల్చొని ఉన్నాడు. ‘మా పెద్ది 18 ఏళ్లు సినీ కెరీర్‌ను పూర్తి చేసుకోవడం ఎంతో సంతోషం. తెరపై ఘనమైన వారసత్వం కొనసాగిస్తూనే బయట ఎంతో వినయ విధేయతను కలిగి ఉండటమే కాకుండా.. తనకంటూ ఓ ప్రత్యేకమైన పంథాను ఏర్పాటు చేసుకున్నాడు. మాకెన్నో అద్భుతమైన ఉత్సాహాన్ని కలిగించే సందర్భాలను ఇచ్చాడు. పెద్ది నుంచి చాలా పెద్ద సర్‌ప్రైజ్‌లు మొదలు కాబోతున్నాయి’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు లుక్ అదిరిందని అంటున్నారు.
చరణ్ పాత్ర ఎంత పవర్ ఫుల్ ఉండనుందో అర్థమవుతోందని కామెంట్లు పెడుతున్నారు. కాగా ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతుండగా.. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ది సినిమాస్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ‘పెద్ది’ భారీ అంచనాల మధ్య వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.






