- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేపే ‘ఫంకీ’ నవ్వుల విందు.. కయాదు లోహర్ క్రేజీ పోస్ట్‌తో భారీ హైప్
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen)బాక్సాఫీస్ వద్ద నవ్వుల విందు వడ్డించడానికి సిద్ధమయ్యాడు.

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen)బాక్సాఫీస్ వద్ద నవ్వుల విందు వడ్డించడానికి సిద్ధమయ్యాడు. ‘జాతిరత్నాలు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన దర్శకుడు అనుదీప్ కేవీ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫంకీ’(Funky). ఈ క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుంచే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అనుదీప్ మార్క్ హ్యూమర్, విశ్వక్ సేన్ ఎనర్జీ తోడైతే వెండితెరపై నవ్వుల జాతరే అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ ఇప్పటికే పూర్తి కావడంతో చిత్ర యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
వాలెంటైన్స్ వీక్ సందర్భంగా విడుదలవుతున్న ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనుదీప్ కేవీ మార్క్ పేరడీ డైలాగులు, విశ్వక్ సేన్ సరికొత్త మేకోవర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరోయిన్ కయాదు లోహర్ (Kayadu Lohar)సోషల్ మీడియా వేదికగా ‘ఫంకీ’ ట్రైలర్ రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాద్‌లోని ప్రసిద్ధ శ్రీరాములు 70mm థియేటర్‌లో సాయంత్రం 4 గంటలకు అభిమానుల మధ్య గ్రాండ్‌గా ఈ ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ ఈవెంట్‌కు చిత్ర యూనిట్ మొత్తం హాజరుకానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు సినిమాపై క్యూరియాసిటీని పెంచగా, ఇప్పుడు ట్రైలర్ తో సినిమా అసలు కథేంటో హింట్ ఇవ్వబోతున్నారు. ఇక కయాదు పోస్ట్‌తో నెటిజన్లతో భారీ హైప్ క్రియేట్ అయింది.
‘ఫంకీ’ నుంచి థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్.. మాస్ బీట్‌తో హీరో హీరోయిన్ రచ్చ






