‘ఫంకీ’ నుంచి థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్.. మాస్ బీట్‌తో హీరో హీరోయిన్ రచ్చ

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-06 03:07:13  IST  )

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Viswak Sen) కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ట్రై చేస్తున్నారు.

‘ఫంకీ’ నుంచి థర్డ్ సింగిల్ ప్రోమో రిలీజ్.. మాస్ బీట్‌తో హీరో హీరోయిన్ రచ్చ
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Viswak Sen) కెరీర్ ప్రారంభం నుంచి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ట్రై చేస్తున్నారు. అలాంటి సినిమాలతోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే గత కొన్నాళ్లుగా అతనికి ఆశించిన విజయాలు అందడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎంత కష్టపడినా హిట్టు మాత్రం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'ఫంకీ'(Funky) సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు.

దీనికి ‘జాతి రత్నాలు’(Jathi Ratnalu) ఫేమ్ అనుదీప్ కేవీ(Anudeep KV) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో స్టార్ బ్యూటీ కయాదు లోహర్(Kayadu Lohar) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానున్నది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ వరుస అప్డేట్స్ ఇస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ యమయమ్మ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ మేరకు ఓ చిన్న వీడియో క్లిప్ షేర్ చేస్తూ.. ‘మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మాస్ నంబర్ ఇదిగో.. ఫంకీ నుంచి యమ యమ్మ ప్రోమో నుండి 3వ సింగిల్ ఇప్పుడు విడుదలైంది..

మొదటి బీట్ నుండి రిపీట్ చేయడానికి సిద్ధంగా ఉండండి.. త్వరలో పూర్తి పాట విడుదల. ఫంకీ సినిమా ఫిబ్రవరి 13 నుండి థియేటర్లలో సందడి చేయనున్నది’ అని రాసుకొచ్చారు. ఇక వీడియోలో హీరో హీరోయిన్ మాస్ బీట్‌తో డ్యాన్స్ ఇరగదీశారు. ఫైనల్‌గా మాస్ మ్యూజిక్ లవర్స్‌కు ఈ సాంగ్ మంచి కిక్ ఇస్తుంది కావచ్చు అని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Next Story