మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ‘టిల్లు స్క్వేర్’ మూవీ ఫస్ట్ సింగిల్

by Disha Web Desk 9 |
మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతున్న ‘టిల్లు స్క్వేర్’ మూవీ ఫస్ట్ సింగిల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ మాస్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటిస్తున్న తాజా చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ‘డీజే టిల్లు’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘టికెట్ ఏ కొనకుండా’ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. మాంచి రిధంలో ఉన్న ఈ పాట జనాలను బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకూ 3 మిలియన్ పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా పాట మొదట్లో హీరో చెప్పిన డైలాగ్‌లు సోషల్ మీడియాలో మార్మోగిపోతున్నాయి. షూటింగ్ పనులు మొత్తం పూర్తిచేసుకుని త్వరలోనే ఈ మూవీ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Read More : ఇప్పుడు నాకు ఆ ధైర్యం లేదు.. పవన్ కల్యాణ్ అభిమానులకు సాయితేజ్ విన్నపం

Next Story

Most Viewed