- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శర్వా నంద్ 'నారి నారి నడుమ మురారి' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్
చార్మింగ్ స్టార్ శర్వా నంద్, రామ్ అబ్బరాజు (Ram దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' .

దిశ, సినిమా: చార్మింగ్ స్టార్ శర్వా నంద్(Sharwanand), రామ్ అబ్బరాజు (Ram Abbaraju)దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' (Nari Nari Naduma Murari )జనవరి 14న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయు, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు. చిత్ర బృందం మ్యూజికల్ ప్రమోషన్స్ ని ప్రారంభించింది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ 'భల్లే భల్లే' సాంగ్‌ను విడుదల చేశారు. ఇది యంగ్ లవ్ లోని హ్యాపీనెస్ ని ప్రజెంట్ చేస్తోంది. హరిచరణ్ పాడిన, రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట విన్న వెంటనే ఆకట్టుకుంటుంది. శర్వా, సాక్షి పాత్రల మధ్య ఉండే కెమిస్ట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాట ఒక విజువల్ ట్రీట్‌లా ఉంది. కేరళలోని పచ్చని ప్రకృతి సౌందర్యం నేపథ్యంలో చిత్రీకరించిన ఈ పాటలోని ఫ్రేమ్‌లు, జంట మధ్య వికసిస్తున్న ప్రేమ అద్భుతంగా చూపించాయి.






