‘అవతార్-3’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల.. బిగ్ అప్డేట్ రాబోతుందంటూ మూవీ మేకర్స్ ట్వీట్

by Mallepaka Hamsa |

హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్(James Cameron) దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్’ సినిమా బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

‘అవతార్-3’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల.. బిగ్ అప్డేట్ రాబోతుందంటూ మూవీ మేకర్స్ ట్వీట్
X

దిశ, సినిమా: హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్(James Cameron) దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్’ సినిమా బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పండోర అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతి అందాలను కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్‌తో అందరినీ కట్టిపడేశారు. దీంతో ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించారు. అవతార్: ది వే ఆఫ్ వాటర్’(Avatar: The Way of Water) ప్రపంచవ్యాప్తంగా దాదాపు 160 భాషల్లో విడుదలై బాక్సాఫీసును షేక్ చేసింది. ఈ రెండు భాగాలకు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీ మేకర్స్ ‘అవతార్-3’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

‘అవతార్-ఫైర్ అండ్ యాష్’టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. బ్రిటిష్ నటి ఊనా చాప్లిన్(Oona Chaplin) నటించిన వరంగ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ను నెట్టింట పెట్టారు. అంతేకాకుండా ట్రైలర్ ఈ నెల 25న ది ‘ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ మూవీ ప్రదర్శనకు ముందు రానున్నట్లు వెల్లడించారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.

link

Next Story