- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్లు అర్జున్ మూవీలో ఆ 5 గురు హీరోయిన్లు ఫైనల్... లిస్ట్ లో రష్మిక !
టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ (Allu Arjun) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప (Pushpa 2) సినిమాతో ఐకాన్

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ (Allu Arjun) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పుష్ప (Pushpa 2) సినిమాతో ఐకాన్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. ఈ సినిమా రెండు పార్టులు బంపర్ హిట్ కావడంతో ప్రపంచ వ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మారుమోగుతోంది. అంతేకాదు జైలుకు పంపించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతనే.. అవార్డు అందుకునేలా చేశాడు అల్లు అర్జున్. అయితే అలాంటి అల్లు అర్జున్ ఇప్పుడు.. హాలీవుడ్ రేంజ్ సినిమాకు సిద్ధమవుతున్నాడు.
తమిళ దర్శకుడు అట్లీతో ( Atlee) అల్లు అర్జున్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరియర్ లో 22వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఇందులో.. దీపిక పదుకునే హీరోయిన్ గా ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. 800 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో దీపికతో పాటు మరో నలుగురు హీరోయిన్లు కూడా మెరువబోతున్నారట.
అయితే ఆ పేర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీపికతో పాటు జాన్వి కపూర్, మృనాల్, రష్మిక మందాన, అలాగే భాగ్యశ్రీ నటించబోతున్నట్లు కొత్తగా తెరపైకి కొత్త చర్చ వచ్చింది. నలుగురు హీరోయిన్లు.. సెకండ్ హాఫ్ లో పరిచయం అవుతారని తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.






