Salaar : ప్రభాస్ ‘సలార్’ వాయిదాపై చిత్ర యూనిట్ క్లారిటీ.. పోస్ట్ వైరల్

by Disha Web Desk 6 |
Salaar : ప్రభాస్ ‘సలార్’ వాయిదాపై చిత్ర యూనిట్ క్లారిటీ.. పోస్ట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత నీల్ కాంబినేషన్‌లో ‘సలార్’ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సలార్ సినిమా రిలీజ్ పెట్టుకుని ప్రమోషన్స్ చేయకపోవడంతో విడుదల వాయిదా పడినట్లు పలు వార్తలు వచ్చాయి.

తాజాగా, నేడు చిత్ర యూనిట్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘ సలార్ సినిమాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కొన్ని అనివార్య కారణాల వల్ల సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ కావట్లేదు. అర్థం చేసుకుంటారని భావిస్తున్నాము. మీకు మరింత మంచి సినిమాటిక్ అనుభవం అందించడానికి మా చిత్ర యూనిట్ కష్టపడుతుంది. సలార్ కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే అనౌన్స్ చేస్తాము’’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్టును చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఎప్పుడు రిలీజ్ చేస్తారు.. ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలని పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed