Niharika: నిహారిక ‘మిత్ర మండలి’ సినిమా టీజర్ అప్డేట్ ఇచ్చిన చిత్రబృందం.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-11 14:19:37  IST  )

యంగ్ హీరోయిన్ నిహారిక(Niharika)కు పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో రీల్స్ చేసుకునే స్థాయి నుంచి ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారి స్టార్ హీరోల పక్కన కనిపించింది.

Niharika: నిహారిక ‘మిత్ర మండలి’ సినిమా టీజర్ అప్డేట్ ఇచ్చిన చిత్రబృందం.. క్యూరియాసిటీ పెంచుతున్న పోస్టర్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ నిహారిక(Niharika)కు పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో రీల్స్ చేసుకునే స్థాయి నుంచి ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారి స్టార్ హీరోల పక్కన కనిపించింది. ఇక ఇప్పుడు ఈ భామ తమిళ, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా మారిపోయింది. ఇక మహేష్ బాబుపై పలు కామెంట్స్ చేసి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఇటీవల ‘పెరుసు’ చిత్రంతో వచ్చిన ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. ఈ అమ్మడు నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘మిత్ర మండలి’(MithraMandali). ఈ చిత్రంలో ప్రియదర్శి(Priyadarshi), రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా(Prasad Behara) ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

ఈ మూవీని కొత్త దర్శకుడు విజయుందర్ ఎస్ తెరకెక్కిస్తుండగా.. బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేశాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, చిత్రబృందం ‘మిత్ర మండలి’ మూవీకి సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా టీజర్ జూన్ 12న మద్యాహ్నం 12గంటలకు రాబోతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఇందులో నిహారిక స్పెషల్ అట్రాక్షన్‌గా గ్రీన్ కలర్ డ్రెస్‌లో కనిపించగా.. ఆమె వెనకాల ఒక కారు ఉండగా.. ప్రియదర్శి, రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ముందు ఉల్లిగడ్డ బాంబులు కాలుస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.

Next Story