- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Upasana Konidela: మెగా ఫ్యామిలీలోకి కొత్త మెంబర్.. పోస్ట్‌తో గుడ్ న్యూస్ రివీల్ చేసిన మెగా కోడలు.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana Konidela)ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana Konidela)ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మెగా కోడలు సినిమాల్లో నటించినప్పటికీ ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. నిత్యం పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తుంటుంది. ఉపాసన పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టి ప్రశంసలు పొందుతుంది. ఇక ఇటీవల తన అత్తతో ఓ ఫుడ్ బిజినెస్‌ను కూడా స్టార్ చేయించింది. దీని ద్వారా సినీ సెలబ్రిటీలకు సర్‌ప్రైజ్‌లు కూడా పంపుతోంది. అయితే ఉపాసన పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తల్లి అయిన విషయం తెలిసిందే. 2023లో జూన్ 20న ఆమెకు ఆడపిల్ల పుట్టింది. అయితే ఆ పాపకు క్లిన్‌కారా అనే పేరు పెట్టారు. కానీ పుట్టినప్పటి నుంచి ఫేస్‌ను మాత్రం ఎవరికీ చూపించలేదు.
నిత్యం అభిమానులు అడుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఇక తన ఫస్ట్ బర్త్ డేకు అయినా చూపిస్తారని అంతా భావించారు. కానీ అలా చేయలేదు. ఇదిలా ఉంటే.. నేడు మెగా ప్రిన్సెస్ రెండో పుట్టినరోజు కావడంతో క్లిన్‌కారా ముఖాన్ని చూపిస్తారని అంతా ఆశపడ్డారు. కానీ అది జరగలేదు. ఈక్రమంలోనే.. ఉపాసన మెగా అభిమానులకు ఓ శుభవార్తను తెలియజేస్తూ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని ఓ ఆడపులికి తన కూతురు క్లిన్ కారా(klin kara) పేరు పెట్టినట్లు వెల్లడించింది. ‘‘ఒక ఏడాది క్రితం అది కేవలం ఒక చిన్న పులి పిల్ల. కానీ ఈరోజు అదొక ఉల్లాసభరితమైన ఆడపులి.
దానికి నా కూతురు క్లిన్‌కారా పేరు పెట్టడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ విధంగా ప్రేమాభిమానాలు చూపించిన హైదరాబాద్ జై బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వన్యప్రాణులు అడవికే సొంతం అయినప్పటికీ వాటిని సంరక్షించడానికి మనం మద్దతు తెలుపుతుంటాం’’ అని రాసుకొచ్చింది. అలాగే ఓ రెండు పులి పిల్లలను దత్తత కూడా తీసుకుని వాటి పోషణకు సరిపడ డబ్బులను జూపార్క్ డైరెక్టర్‌కు ఇచ్చింది. అంతేకాకుండా తన కూతురితో దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఇక ఇందులో తల్లి ఓడిలో క్లిన్‌కారా రింగుల జుట్టుతో చాలా క్యూట్‌గా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అవి చూసిన నెటిజన్లు చాలా క్యూట్‌గా ఉందని కామెంట్లు చేస్తున్నారు.






