‘భోళా శంకర్’ ఎఫెక్ట్.. ఇల్లు తాకట్టు పెట్టి మరీ చిరంజీవికి డబ్బులిచ్చిన నిర్మాత!

by Disha Web Desk 9 |
‘భోళా శంకర్’ ఎఫెక్ట్.. ఇల్లు తాకట్టు పెట్టి మరీ చిరంజీవికి డబ్బులిచ్చిన నిర్మాత!
X

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ చిత్రం భారీ అంచనాలతో ఈ నెల (ఆగస్టు)11న థియేటర్లలో విడుదలయ్యింది. సినిమా ఫ్లాప్ కావడంతో డైరెక్టర్ మెహెర్ రమేష్‌ను సోషల్ మీడియాలో అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో చిరంజీవిని ఒప్పించడానికి నిర్మాత అనిల్ చాలా ఇబ్బంది పడ్డాడట. రూ.65 కోట్లు ఇస్తేనే ఈ మూవీలో నటిస్తానని చిరు అన్నాడట. అప్పటికే బిజినెస్ జరగక చాలా ఇబ్బందుల్లో ఉన్న నిర్మాత షాద్ నగర్, సూర్యాపేటలోని కొన్ని స్థలాలు, అలాగే హైదరాబాద్‌లోని ఇల్లు తాకట్టు పెట్టి మరీ మెగాస్టార్‌‌కు డబ్బులు ఇచ్చాడట. అనంతరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సినిమా విడుదల చేశారట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది.

Next Story