రష్మికకు వచ్చిన ఆరోగ్య సమస్య ఇదే.. వెరైటీగా వివరించిన డాక్టర్

by Disha Web Desk 2 |
రష్మికకు వచ్చిన ఆరోగ్య సమస్య ఇదే.. వెరైటీగా వివరించిన డాక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ పరిశ్రమ నుంచి ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ బ్యూటీ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో 'చలో' సినిమాతో పరిచయమై 'పుష్ప' ఇండియాలోనే మాంచి క్రేజ్ తెచ్చుకున్నది. మరీ ముఖ్యంగా పుష్ప సినిమాలో 'సామి సామి' పాటకు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. ఆ పాటలో ఆమె పండించిన హావభావాలతో పాటు వేసిన స్టెప్పులకు కుర్రకారు ఫిదా అయ్యారు. అయితే, పుష్ప సినిమా కోసం అతిగా కష్టపడ్డ రష్మిక కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె ఇటీవల ప్రముఖ డాక్టర్ ఏవీ గురువా రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆమెను పరీక్షించిన డాక్టర్ పోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. "నువ్వు 'సామి..సామి..' అంటూ మోకాళ్ళ మీద బరువంతా వేసి డాన్స్ చెయ్యడం వల్లే ఇలా నొప్పులు వచ్చి పడ్డాయి!" అని మోకాలి నొప్పి అంటూ నా దగ్గరకు వచ్చిన 'శ్రీవల్లి'కి సరదాగా దవి విరుస్తూ ఇలా అన్నాను. పుష్ప సినిమా చుసిన మొదలు, రష్మికని కలిసి అభినందించాలనుకున్న నాకు ఆమె మోకాలి నొప్పి ద్వారా ఆ సందర్భం వచ్చింది. బన్నీ కూడా త్వరలో షోల్డర్ పెయిన్‌తో వస్తాడేమో'' అంటూ సరదాగా ఫేస్‌బుక్ వేదికగా పోస్టు పెట్టారు.

Also Read: అలాంటి క్యారెక్టర్‌లో కనిపించినందుకు హ్యాపీగా ఉంది: 'జోగి' పాత్రపై అమైరా

Next Story

Most Viewed